నమస్తే శేరిలింగంపల్లి: కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో స్వీయ నిర్బంధమే శ్రీరామ రక్ష అని, ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ నిబంధనలను ప్రతి ఒక్కరు తూచా తప్పకుండా పాటించాలని శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజలకు ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ పిలుపునిచ్చారు. ఇది మనందరి కనీస బాధ్యత అని, ప్రతి ఒక్కరు ఇంటి నుండి బయటకు రావద్దని, అందరం ఇళ్లలోనే ఉండి కరోనా వ్యాప్తిని అడ్డుకుందామని అన్నారు. బలమే జీవనం, బలహీనమే మరణం అన్న వివేకానంద స్వామి పిలుపును గుర్తుంచుకొవాలని అన్నారు. ఆదాయార్జనతో పాటు ఆరోగ్యార్జన కోసం సమయాన్ని వెచ్చించాలన్నారు. సనాతన ధర్మాన్ని ఆచరిద్దాం… సకల రోగాలకు దూరంగా ఉందాము… అని గుర్తుచేశారు. ఈ లాక్ డౌన్ సమయంలో ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు ప్రభుత్వం పేసులుబాటు కలిపించిందని, ఈ నాలుగు గంటలు తెలంగాణలో ఏ మారుమూల ప్రాంతనికైనా వెళ్ళొచ్చునని, ఇతర రాష్ట్రాలకు వెళ్ళవలసిన వారు ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకొని పోలీస్ శాఖ వారు జారీ చేసే పాస్ తీసుకొని ప్రయాణం చేసుకోవాలని సూచించారు. కుటుంబ అవసరాలు తీర్చుకోవడాని ఈ నాలుగు గంటల సమయం సద్వినియోగం చేసుకోవాలని, అనవసరంగా బయటకి రావొద్దని అన్నారు.
ఉదయం 10 గంటల నుండి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు లాక్ డౌన్ నిబంధనలు కొనసాగుతాయని విషయాన్ని గుర్తెగాలన్నారు. భవన నిర్మాణ రంగ కార్మికులను ఆయా భవనాల నిర్మాణదారులు, బిల్డర్లు మానవతా దృక్పథంతో ఆదుకోవాలని, ఇతర ప్రాంతాల నుండి వచ్చిన వలస కార్మికులను ఎక్కడైతే అక్కడే కార్మికులకు వసతులు కలిపించే బాధ్యత ఆయా నిర్మాణ సంస్థలదే అని అన్నారు. ప్రభుత్వ, ప్రయివేట్ హాస్పిటల్స్ వెంటిలేటర్స్, ఆక్సిజన్ లేకపోయినా, వ్యాక్సినేషన్, మందుల పంపిణీ సరిగా జరుగకపొవడం లాంటి ఇబ్బందులు ఎదురైతే తమ దృష్టికి తీసుకురావాలని ప్రజలకు సూచించారు. అదేవిధంగా వెంటి లెటర్ ,ఆక్సిజన్ వ్యాక్సినేషన్, బెడ్ల కొరత, మందుల పంపిణీ వంటి అంశాలపై గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ టాస్క్ ఫోర్స్ పర్యవేక్షిస్తుందన్నారు. ఇక్కడ తనతో పాటు కార్పొరేటర్లు పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని, ప్రజలు అధైర్య పడవద్దని నిర్బయంగా ఉండలని, మాతో పాటు టీఆర్ఎస్ పార్టీ డివిజన్ల అధ్యక్షులు, నాయకులు సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ప్రతి ఒక్కరు బాధ్యత గా ఉండాలని, వైరస్‌వ్యాప్తి చెందకుండా ప్రతి ఒక్కరూ విధిగా మాస్కులు ధరించడంతో పాటు భౌతికదూరం పాటించాలని, శానిటైజర్లను ఉపయోగించి తరచూ చేతులు శుభ్రం చేసుకోవాలని సూచించారు.