క‌రోనా క‌ష్ట‌కాలంలో విశిష్ట సేవ‌లందిస్తున్న‌ నర్సుల‌కు స‌మాజ‌మంతా శిర‌స్సు వంచి ప్ర‌ణ‌మిల్లుతుంది: రామ‌స్వామి యాద‌వ్‌

న‌మ‌స్తే శేరిలింగంపల్లి: ఫ్రెండ్స్ వెల్ఫ‌ర్ అసోసియేష‌న్ క‌న్వీన‌ర్ తాడిబోయిన రామ‌స్వామి యాద‌వ్ ఆద్వ‌ర్యంలో బుద‌వారం అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని ఘ‌నంగా నిర్వ‌హించారు. శేరిలింగంప‌ల్లిలోని ప్రాథ‌మిక ఆరోగ్య కేంద్రం స‌మీపంలో దయానంద్ యాదవ్ సౌజన్యంతో జ‌రిగిన ఈ వేడుక‌ల్లో ఫ్లోరెన్స్ నైటింగెల్ చిత్ర‌పటం వ‌ద్ద కొవ్వ‌త్తులు వెలిగించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా శేరిలింగంపల్లి,హ‌ఫీజ్‌పేట్ ఆరోగ్య కేంద్రాలు, కొండాపూర్, పఠాన్ చెరు ఏరియా హాస్పిట‌ల్స్‌, నిమ్స్, భెల్‌, త‌దిత‌ర‌ ప్రభుత్వ హాస్పిటల్స్‌కి చెందిన నర్సుల స‌త్క‌రించి జ్జాపిక‌లు అంద‌జేశారు. అనంత‌రం రామస్వామియాద‌వ్ మాట్లాడుతూ రోగులకు వైద్యులు ఇచ్చే ఔషధం ఎంత ముఖ్యమో నర్సులు చేసే సేవ కూడా అంతే ముఖ్యమని అన్నారు. మందులు లేని కరోనా వైరస్‌పై ఆయుధం లేకుండా పోరాటం సాగిస్తున్న వారు నర్సులు అని కొనియాడారు. ఈ క్ర‌మంలోనే న‌ర్సుల‌కు స‌మాజ‌మంతా శిర‌సు వంచి ప్ర‌ణ‌మిల్లుతుంద‌ని అన్నారు.

న‌ర్సుల‌ను స‌న్మానిస్తున్న రామ‌స్వామి యాద‌వ్‌, ద‌యానంద్ యాద‌వ్ త‌దిత‌రులు

నర్సుల సేవలు అనిర్వచనీయమ‌ని, కరోనా బాధితులకు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా వారు అందిస్తున్న తీరుతో వారి పట్ల ఉన్న గౌర‌వం ఎన్నోరెట్లు రెట్టింప‌య్యింద‌ని అన్నారు. ఫ్లారెన్స్ నైటింగేల్ జన్మదినాన్ని ఆమె చేసిన సేవలకు గుర్తింపుగా ఆమె గౌరవార్థం ప్రపంచ వ్యాప్తంగా అంతర్జాతీయ నర్సుల దినోత్సవంగా జరుపుకొంటున్నామని, నైటింగేల్ 12 మే 1812 నాడు ఇటలీలో ఒక సంపన్న కుటుంబంలో జన్మించారని వివరించారు. యుద్ధ సమయంలో దెబ్బతిన్న ప్రతి సైనికునికి తాను బ్రతుకుతాను అనే నమ్మకాన్ని తన సేవల ద్వారా కలిగించారని చెప్పారు. రాత్రి సమయాల్లో లాంతర్ తీసుకొని వారి దగ్గరకు వెళ్లి సేవలు అందించింది. అందుకనే ఆమె లేడీ విత్ ల్యాంప్‌గా ప్రసిద్ధి చెందిన‌ద‌న్నారు. నేటి యువ నర్సులు ఆవిడ జీవితంను ఆదర్శంగా తీసుకుని రోగుల పట్ల ప్రేమానురాగాలు చూపించి వారిలో ఆత్మస్తైర్యంను నింపి సేవలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు రామ్మోహన్‌రావు , వెంకటేశ్వరరావు , నాగేశ్వరరావు , నరేష్ , ఖాదర్ మొయినుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

 

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here