నమస్తే శేరిలింగంపల్లి: కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా మియాపూర్ డివిజన్ పరిధిలోని ఎంఏనగర్ బస్తీలో డీఆర్ఎఫ్ శానిటైజేషన్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. డ్రైవ్‌లో పాల్గొన్న స్థానిక కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ వాడవాడల తిరుగుతు డీఆర్ఎఫ్ సిబ్బందించే సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారి చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కరోనా కట్టడికి తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో చందనగర్ డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి, జీహెచ్ఎంసీ శ్యానిటేషన్, ఎంటమలజీ, డీఆర్ఎఫ్ సిబ్బంది, బస్తీ నాయకులు రాజు గౌడ్, విజయ్ ముదిరాజ్, శివ, తదితరులు పాల్గొన్నారు.