నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణ ఉద్యమకారుడు, అడ్వకేట్ జేఏసీ రాష్ట్ర నాయకుడు, శేరిలింగంపల్లికి చెందిన ప్రముఖ న్యాయవాదికి ఎట్టకేలకు న్యాయశాఖలో సముచిత స్థానం లభించింది. కుకట్‌పల్లి కోర్టుల అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్‌గా న్యాయవాది పి.గోవర్ధన్ రెడ్డిని నియమిస్తు న్యాయశాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. మలిదశ ఉద్యమంలో తెలంగాణ అడ్వకేట్ జేఏసీ తరపున పొలిటికల్ జేఏసీలో కీలక పాత్ర పోషించిన గోవర్ధన్‌రెడ్డికి కుకట్‌పల్లి కోర్టుల ఏజీపీగా అవకాశం లభించడంపై శేరిలింగంపల్లి, కుకట్‌పల్లి ప్రాంతాలకు చెందిన ఉద్యమకారులు, వివిధ పార్టీల నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గోవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ తనపై నమ్మకముంచి భాద్యతలు అప్పగించిన తెలంగాణ ప్రభుత్వానికి అందుకు సహకరించిన ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు కేటీఆర్, ఇంద్రకరణ్ రెడ్డి, మల్లారెడ్డి, ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ, కుకట్‌పల్లి శాసనసభ్యులు కృష్ణారావు, ఎమ్మెల్సీ నవీన్‌రావులకు ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. కుకట్‌పల్లి కోర్టులకు సంబంధించిన న్యాయ సేవల విషయంలో తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని అన్నారు.