నమస్తే శేరిలింగంపల్లి: హపీజ్‌పేట్‌లోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బందికి ఫీడ్ ద నీడీ సంస్థ ఎన్ 95 మాస్కులను అందజేసింది. సంస్థ ప్రతినిధి ప్రదీప్, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఙానేంద్ర ప్రసాద్‌లు కేంద్రం వైద్యాధికారి డాక్టర్ వినయ్‌బాబుకు మంగళవారం మాస్కులను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా విజృంభనలోను వైద్య సిబ్బంది అహర్నిషలు కృషి చేస్తన్నారని, ప్రభుత్వ చేపడుతున్న రక్షణ చర్యలకు అదనంగా సిబ్బంది కోసం తమ వంతు సహకారం అందిస్తున్నట్టు తెలిపారు. ప్రభుత్వ దవఖానాల్లో మెరుగైన సౌకర్యాల కల్పించాలని డీఎంహెచ్ఓకు వినతి పత్రం అందజేయడం జరిగిందని జ్ఞానేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు.