నమస్తే శేరిలింగంపల్లి: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో భాగంగా గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి శనివారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. డివిజన్ 27 బిజెపి అభ్యర్థి చింతాకుల అనిల్‌తో కలిసి లక్ష్మీపురంలో గంగాధర్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి గద్దెనెక్కక ముందు వరంగల్‌ను హైదరాబాద్‌గా మారుస్తానన్న కేసీఆర్ మార్పులు తీసుకొచ్చాడు. అభివృద్ధి ఏమోగాని వర్షం పడితే మాత్రం వరంగల్ సైతం హైదరాబాద్ మాదిరిగా నీట మునిగేలా చేశారని ఎద్దేవా చేశారు. ఐతే హైదరాబాద్‌లో వరద సాయం అందించిన కేసీఆర్ వరంగల్‌లో వరదలు వచ్చినప్పుడు మాత్రం ఎందుకు ముఖం చాటేశారని ప్రశ్నించారు. ప్రజలు ఈ విషయాలను అర్థం చేసుకుని టీఆర్ఎస్కు ఈ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. డివిజన్ 27 బిజెపి అభ్యర్థి అనిల్ కుమార్‌కు మద్దతు తెలిపి భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో స్తానిక బిజెపి నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.