నమస్తే శేరిలింగంపల్లి: యువ పారిశ్రమిక వేత్తలను ప్రోత్సహిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గచ్చిబౌలిలో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన టీ హబ్‌ను రాష్ట్ర మంత్రులు కేటీఆర్, వి.శ్రీనివాస్ గౌడ్, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిలు బుదవారం సందర్శించారు. అక్కడ వివిధ రంగాలకు చెందిన యువ నిపుణుల ఆవిష్కరణల గురించి అడిగి తెలుసుకున్నారు. మంత్రులతో పాటు ఐటీ కమిషనర్ జయేశ్ రంజన్ తదితరులు పాల్గొన్నారు.