నమస్తే శేరిలింగంపల్లి: మహాత్మ జ్యోతిబా పూలే రాష్ట్ర స్థాయి జయంతి ఉత్సవాల కమిటి చైర్మన్‌గా తెలంగాణ సగర(ఉప్పర) సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఉప్పరి శేఖర్ సగర, నియమితులయ్యారు. తెలంగాణ రాష్ట్ర బిసి సంక్షేమ సంఘం అద్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ మహాత్మ జ్యోతిబా పూలే రాష్ట్ర స్థాయి జయంతి ఉత్సవాల కమిటిని బుదవారం ప్రకటించారు. కమిటి గౌరవ సలహాదారులుగా కుందారం గణేష్‌చారీ, గోదారం యాదగిరి, చైర్మన్ గా ఉప్పరి శేఖర్ సగర, కో చైర్మన్‌లుగా పి.బడేసాబ్, కనకాల శ్యాం, టీ.విక్రం గౌడ్, వైస్‌చైర్మన్‌లుగా మణిమంజరి, పద్మ, చంద్రశేఖర్ గౌడ్, లింబాద్రి వేణు, నాగారం భాస్కరచారీ, కోఆర్డినేటర్స్‌గా ఈడిగ శ్రీనివాస్ గౌడ్, మదేశి రాజేందర్, పానుగంటి విజయ్, మనోజ్, దేవేందర్, శ్రీనివాస చారి, మమత గౌడ్‌లు నియమితులయ్యారు. ఈ సందర్భంగా చైర్మన్ శేఖర్ సగర మాట్లాడుతూ సామాజిక సంఘ సంస్కర్త, బహుజన మార్గదర్శకులు, మహాత్మా జోతిబా పూలే 194 వ జయంతిని ఘనంగా నిర్వహించుకుందామని, రాష్ట్రంలోని బహుజనులంతా ఇందుకు పూర్తి సహాయ సహకారాలు అందించాలని పిలుపునిచ్చారు.