నమస్తే శేరిలింగంపల్లి: దీర్ఘకాలికంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఓ మహిళ నిర్మాణంలో ఉన్న భవనం పై నుండి దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన చందానగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సిద్దిపేట ప్రాంతానికి చెందిన యెళ్ల నాగేష్‌రెడ్డి చందానగర్‌లోని కెఎస్ఆర్ క్లాసిక్ అపార్ట్‌మెంట్‌లో నివాసముంటూ సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. నాగేష్‌రెడ్డి తల్లి ఆళ్ల వినోద(52) కొద్ది కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతోంది. ఈ క్రమంలో కుటుంబ సభ్యులు తరచుగా ఆసుపత్రికి తీసుకువెళ్లి చికిత్స అందిస్తున్నారు. కాగా ఆదివారం వైద్య చికిత్స నిమిత్తం నాగేష్‌రెడ్డి వద్దకు వచ్చిన వినోద సోమవారం ఉదయం తమ నివాసానికి సమీపంలో నిర్మాణంలో ఉన్న భవనంపై నుండి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. విషయం తెలుసుకున్న నాగేష్‌రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.