గచ్చిబౌలి(నమస్తే శేరిలింగంపల్లి): అర్హత కలిగిన ప్రతీ పేద కుటుంబపు సొంతింటి కల నెరవేర్చడమే టిఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి శాసన సభ్యులు అరికెపుడి గాంధీ అన్నారు. బుధవారం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గులమోహర్ పార్కు కాలనీలో నిర్మాణమవుతున్న డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పనులను ఎమ్మెల్యే గాంధీ స్థానిక కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబ, డిసి వెంకన్నతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ అర్హులైన పేదలందరికీ ఇండ్లు కట్టించాలనే సంకల్పం తో గౌరవ ముఖ్యమంత్రి కెసిఆర్ డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారన్నారు. పేదవారి జీవితం లో వెలుగులు నింపేందుకు కెసిఆర్ కలలుగన్న ప్రాజెక్ట్ డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణమని అన్నారు. ఇందులో భాగంగానే గుల్మొహర్ పార్క్ లో ఇండ్లు నిర్మించడం జరుగుతుందని . అదేవిధంగా గులమోహర్ కాలనీ లో నిర్మిస్తున్న ప్రాజెక్ట్ పూర్తయి ప్రారంభానికి సిద్ధంగా ఉందన్నారు. అదేవిధంగా ఇతర ప్రాంతాల్లో సైతం త్వరితగతిన ఇండ్ల నిర్మాణము పూర్తి చేసి పేద ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. గాంధీ గారు తెలియచేసారు. లబ్ధిదారులను లాటరీ ద్వారా ఎంపిక చేయడం జరుగుతున్నదని తెలిపారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయిస్తామని బ్రోకర్లు డబ్బులు వసూలు చేస్తున్నరన్న విషయం మా దృష్టికి వచ్చిందని, ఎవరి ప్రలోభాలకు గురికాకుండా, డబ్బులు ఇచ్చి మోసపోకూడదని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు హౌసింగ్ డీఈ నర్సయ్య, శేరిలింగంపల్లి సిటీ ప్లానర్ శ్రీనివాస్, ఏఈ వెంకటేశ్వర్లు, డీఈ శ్రీనివాస్, కృష్ణవేణి, రెవెన్యూ ఇన్స్పెక్టర్ చంద్రా రెడ్డి, కాంట్రాక్టర్ ప్రేమ్ కుమార్ మరియు మాజీ కార్పొరేటర్ అశోక్ గౌడ్, మియాపూర్ డివిజన్ అధ్యక్షులు ఉప్పలపాటి శ్రీకాంత్, శేరిలింగంపల్లి డివిజన్ అధ్యక్షులు మారబోయిన రాజు యాదవ్ హోప్ ఫౌండేషన్ ఛైర్మెన్ కొండా విజయ్ తెరాస నాయకులు దాసరి గోపి,సత్యనారాయణ ,రమేష్ ,రాజు తదితరులు పాల్గొన్నారు.