స్త్రీల ఆరోగ్యానికి పరిశుభ్రత ఎంతో ముఖ్యం

బిజెపి రాష్ట్ర కార్యదర్శి కొల్లి మాధవి

కార్యక్రమంలో ప్రసంగిస్తున్న బిజిపి రాష్ట్ర కార్యదర్శి కొల్లి మాధవి

శేరిలింగంపల్లి(నమస్తే శేరిలింగంపల్లి): స్త్రీల ఆరోగ్యంపై వ్యక్తిగత పరిశుభ్రత ఎంతగానో దోహదం చేస్తుందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి కొల్లి మాధవి అన్నారు. భారత ప్రధాని నరేంద్రమోదీ 70వ జన్మదిన వేడుకల నేపథ్యంలో నిర్వహిస్తున్న “సేవ సప్తాహ” కార్యక్రమాన్ని బుధవారం బీజేపీ శేరిలింగంపల్లి మహిళ మోర్చా ఆధ్వర్యంలో పాపిరెడ్డి కాలనీ నిర్వహించారు. ఈ సందర్భంగా స్త్రీలకు 8000 సానిటరీ నాప్కిన్ లను పంపిణి చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కొల్లి మాధవి మాట్లాడుతూ మహిళలకు వ్యక్తిగత శుభ్రత ప్రాముఖ్యత గురించి వివరించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రస్తావించిన శుచిశుభ్రత, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, మహిళల ఆత్మ గౌరవం విషయాలను గుర్తుచేశారు. లింగంపల్లి డివిజన్లో బిజెపి శ్రేణులు చేపడుతున్న కార్యక్రమాలు ఆదర్శప్రాయంగా ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ శేరిలింగంపల్లి ఇంచార్జి గజ్జల యోగానంద్, బీజేపీ రాష్ట్ర నాయకులు కసిరెడ్డి భాస్కర్ రెడ్డి, డివిజన్ అధ్యక్షులు రాజు శెట్టి, సీనియర్ నాయకురాలు కాంచన కృష్ణ, డివిజన్ ప్రధాన కార్యదర్శులు చిత్తరెడ్డి ప్రసాద్, ప్రశాంత్ చారి, ఉపాధ్యక్షులు బాబు ,కార్యదర్శి రజని, వీరేశం, ఓబీసీ అధ్యక్షులు పట్లోళ్ల నర్సింహా, శ్రీకాంత్, సబియా, శ్రీలత, సత్య కురుమ, ఆనంద్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

మహిళలకు సానిటరీ ప్యాడ్లు అందజేస్తున్న దృశ్యం
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here