శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజలు, ప్రజప్రతినిధులు, తెరాస నాయకులు, కార్యకర్తల తరపున సీఎంకు ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సీఎం కేసీఆర్ ఇంకా ఇలాగే ఎన్నో ఏళ్ల పాటు తెలంగాణకు సీఎంగా ఉండాలని, ప్రజల సంక్షేమం కోసం మరెన్నో పథకాలను ప్రవేశపెట్టాలని గాంధీ ఆకాంక్షించారు.