చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): గులాబీ జెండా పార్టీ రాష్ట్ర ప్రజలకు అండగా ఉంటుందని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. మంగళవారం చందానగర్ డివిజన్ పరిధిలోని చందానగర్‌లో నిర్వహించిన తెరాస పార్టీ సభ్యత్వ నమోదులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కార్పొరేటర్లు మంజుల రఘునాథ్, ఉప్పలపాటి శ్రీకాంత్ లతో కలిసి తెరాస నాయకులు, కార్యకర్తలకు సభ్యత్వ నమోదు పత్రాలను అందజేశారు.
అనంతరం గాంధీ మాట్లాడుతూ.. తెరాస పార్టీ సభ్యత్వ నమోదుతో రాష్ట్రంలో పండుగ వాతావరణం నెలకొందన్నారు. ప్రజలు పెద్ద ఎత్తున సభ్యత్వాలను తీసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారన్నారు. శేరిలింగంపల్లిలో భారీ ఎత్తున సభ్యత్వాలను నమోదు చేపట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ రవీందర్ రావు, డివిజన్ తెరాస అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి, తెరాస నాయకులు మిరియాల రాఘవరావు, ఉరిటి వెంకట్రావ్, వెంకటేష్ ముదిరాజ్, ప్రవీణ్ , జనార్దన్ రెడ్డి, లక్ష్మీ నారాయణ, అక్బర్ ఖాన్, గుడ్ల ధనలక్ష్మి, వెంకటేష్ పాల్గొన్నారు.