నమస్తే శేరిలింగంపల్లి: ఆర్ ఎస్ఎస్, భారతీయ జన సంఘ్ మాజీ అధ్యక్షుడు పండత్ దీన దయాల్ ఉపాధ్యాయ బలిదాన్ దివాస్ కార్యక్రమాన్ని శేరిలింగంపల్లి డివిజన్ లో నిర్వహించారు. డివిజన్ పరిధిలోని జయశంకర్ చౌక్ వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి గా రంగారెడ్డి అర్బన్ జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి చింతకింది గోవర్ధన్ గౌడ్ హాజరై దీన్ దయాల్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గోవర్ధన్ గౌడ్ మాట్లాడుతూ ఆర్ఎస్ ఎస్, జన సంఘ్ లకు అధ్యక్షుడిగా దీన దయాల్ అందించిన సేవలు ఎనలేనివన్నారు.
ఏకాత్మతా మనవతా వాద సిద్ధాంతాన్ని ప్రతిపాదించి సంఘ్ బలోపేతానికి ఎంతగానో కృషి చేశారన్నారు. మనమనంతా ఆయన అడుగుజాడల్లో నడిచి ఆశయాలను నెరవేర్చాలన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అద్యక్ష్యులు రాజు శెట్టి, ప్రధాన కార్యదర్శులు చిట్టా రెడ్డి ప్రసాద్, సత్య కుర్మ, కార్యదర్శి మనోజ్ ముదిరాజ్, మహిళ నాయకులు కాంచన కృష్ణ, అరుణ కుమారి, అంకమ్మ, బీ.జే.వై.ఎం నాయకులు మహేష్ రాపన్, ఎళ్లేశ్ కురుమ, భారత్ రాజ్, ఆలకుంట రాజు, శ్రీకాంత్, శంకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.