మియాపూర్ డిపో 2 నూత‌న మేనేజ‌ర్‌కు టీఎంయూ నాయ‌కుల శుభాకాంక్ష‌లు

మియపూర్‌‌ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మియాపూర్ డివిజ‌న్ ప‌రిధిలోని మియాపూర్ ఆర్టీసీ డిపో 2 మేనేజ‌ర్‌గా నూత‌నంగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన రాజేంద‌ర్ రెడ్డిని డిపో తెలంగాణ మ‌జ్దూర్ యూనియ‌న్ నాయ‌కులు గురువారం మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిసి ఆయ‌న‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ సంద‌ర్భంగా యూనియ‌న్ రాష్ట్ర కార్యదర్శి వి.యాదయ్య డిపోలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను డిపో మేనేజర్ దృష్టికి తీసుకువ‌చ్చారు. ఈ కార్యక్రమంలో డివిషనల్ కార్యదర్శి కె.జె.రెడ్డి, డిపో ఆధ్యక్ష కార్యదర్శులు శంకర్ రావు, కిషన్ రావు, గ్యారేజ్ కార్యదర్శి చంద్రయ్య, ఉద్యోగులు పాల్గొన్నారు.

మియాపూర్ ఆర్టీసీ డిపో 2 మేనేజ‌ర్ రాజేంద‌ర్ రెడ్డికి శుభాకాంక్ష‌లు తెలుపుతున్న టీఎంయూ నాయ‌కులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here