సద్గురు శ్రీ సేవాలాల్‌ మహరాజ్ ప్రత్యేక స్టాంపు విడుదల

హైదరాబాద్‌ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): సద్గురు శ్రీ సేవాలాల్‌ మహరాజ్‌ 282వ జయంతి సందర్భంగా ఆయన జ్ఞాపకార్థం పోస్టల్‌ శాఖ బుధవారం ప్రత్యేక స్టాంపు‌ను విడుదల చేసింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ పోస్టల్‌ సర్కిల్‌ చీఫ్‌ పోస్ట్‌ మాస్టర్‌ జనరల్‌ ఎస్‌.రాజేంద్ర కుమార్‌, రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌, రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి, రిటైర్డ్ ఐఏఎస్‌ తేజావత్‌ రామచంద్రుడు, హైదరాబాద్‌ రీజియన్‌ పోస్ట్‌ మాస్టర్‌ జనరల్‌ డాక్టర్‌ పి.విద్యాసాగర్‌ రెడ్డి, హెడ్‌క్వార్టర్స్‌ రీజియన్‌ పోస్ట్‌ మాస్టర్‌ జనరల్‌ కల్నల్‌ సాగర్‌ హనుమాన్‌ సింగ్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు. హైదరాబాద్‌లోని డాక్‌ సదన్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న అతిథులు ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సుకన్య సమృద్ధి యోజన పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. దీని వల్ల ఆడపిల్లల భవిష్యత్తుకు ఎలాంటి ఢోకా ఉండదన్నారు.

సద్గురు శ్రీ సేవాలాల్‌ మహరాజ్ ప్రత్యేక కవర్ ను విడుదల చేస్తున్న తెలంగాణ పోస్టల్‌ సర్కిల్‌ చీఫ్‌ పోస్ట్‌ మాస్టర్‌ జనరల్‌ ఎస్‌.రాజేంద్ర కుమార్‌, రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here