గచ్చిబౌలి (నమస్తే శేరిలింగంపల్లి): గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నేతాజీ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు భేరి రామచందర్ యాదవ్ ఆధ్వర్యంలో శ్రీ శ్రీ శ్రీ రేణుక ఎల్లమ్మ నల్ల పోచమ్మ దేవాలయంలో శ్రీరాముడికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రతి వీధిలో జైశ్రీరామ్ జైశ్రీరామ్ రామ నామం జపిస్తూ అయోధ్యలో రామాలయ మందిర నిర్మాణానికి నేతాజీ నగర్ కాలనీలో ఇంటింటికీ తిరిగి విరాళాలు సేకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీరాముడి మందిర నిర్మాణానికి అందరూ సహకరించాలని అన్నారు. మర్యాద పురుషోత్తముడు శ్రీరాముడి మందిరం నిర్మాణంలో భాగస్వాములవుతున్నందుకు అందరి జన్మలు ధన్యమవుతాయన్నారు. ఈ కార్యక్రమంలో షిరిడి సాయి బాబా ఆలయం ప్రధానార్చకుడు జోషి రాఘవేంద్ర శర్మ, కరసేవకుడు ఉప్పరి శ్రీనివాస్ సాగర్, ఉపాధ్యక్షుడు రాయుడు, టి కుమార్ ముదిరాజ్, అర్చకుడు రాఘవేంద్ర, యువజన నాయకుడు ఎం నాగరాజు పాల్గొన్నారు.
