చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ డివిజన్ పరిధిలోని దీప్తిశ్రీ నగర్ శ్రీ రామాలయ కమిటీ ఉపాధ్యక్షులు, టిఆర్ఎస్ సీనియర్ నాయకులు, సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రముఖులు కాకర్ల బాలాజీ రావు(75) కరోనా బారిన పడి మృతి చెందారు. కాగా ఆలయ కమిటీ సభ్యులు, కాలనీ ప్రముఖులు స్థానిక పార్కులో బాలాజీ రావు చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు. ఆలయ స్థాపన, అభివృద్ధిలో అదేవిధంగా సీనియర్ సిటిజన్స్ సంక్షేమం కోసం కాకర్ల చూపిన చొరవను వారు కొనియాడారు. నివాళులర్పించిన వారిలో ఓం ప్రకాష్ గౌడ్, డిబి మోహన్ రావు, నందకుమార్, శ్రీనివాస రావు, గోపాలకృష్ణ, సాంబిరెడ్డి, చంద్రశేఖర్, కాట్రగడ్డ సత్యం తదితరులున్నారు.