నమస్తే శేరిలింగంపల్లి: పూర్ణిమ సందర్భంగా గురువారం నాంపల్లి బాబా ఆలయంలో దత్త హోమం, శ్రీ సత్యనారాణస్వామి వ్రతం, హారతి కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం అన్నప్రసాదవితరణ కార్యక్రమం చేపట్టారు. సాయంత్రం పల్లకి సేవ నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని బాబాను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.