నమస్తే శేరిలింగంపల్లి: గుర్తు తెలియిని వృద్ధురాలి మృతదేహం లభ్యమైన సంఘటన చందానగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ అహ్మద్ పాష తెలిపిన వివరాల ప్రకారం… లింగంపల్లి రైల్వేస్టేషన్ 6వ నెంబర్ ప్లాట్‌ఫామ్ వైపు రోడ్డు పక్కన ఓ వృద్ధురాలు పడిపోయి ఉందని స్థానికులు సమాచారం అందించారని, వెళ్లి పరిశీలించగా అప్పటికి మృతి చెంది ఉందని తెలిపారు. వృద్ధురాలి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ వైద్యశాలకు తరలించామని అన్నారు. మృతురాలి వివరాలు తెలిసిన వారు చందానగర్ పోలీస్‌స్టేషన్‌లో సమాచారం అందించాలని సూచించారు.