చందాన‌గ‌ర్ పీఆర్‌కే హాస్పిట‌ల్‌లో కోవిడ్ వ్యాక్సినేష‌న్‌

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: చందాన‌గ‌ర్‌ పీఆర్‌కే హాస్పిట‌ల్‌లో కోవిడ్ వ్యాక్సినేష‌న్ ప్రారంభ‌మ‌య్యింది. డీఎంహెచ్ఓ డాక్ట‌ర్ స్వ‌రాజ్య ల‌క్ష్మి, అడిష‌న‌ల్ డీఎంహెచ్ఓ డాక్ట‌ర్ సృజ‌న‌ల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో హాస్పిట‌ల్ చైర్మ‌న్ పుట్ట సుధాక‌ర్ యాద‌వ్‌, ఎండీ ర‌వికుమార్‌ల‌తో పాటు డాక్ట‌ర్లు, న‌ర్సులు, ప్యారా మెడిక‌ల్ సిబ్బంది, నాన్ మెడిక‌ల్ టీమ్‌ల‌తో క‌ల‌సి మొత్తం 100 మందికి పైగా వ్యాక్సిన్ తీసుకున్నారు. ఈ సంద‌ర్భంగా చైర్మ‌న్ మాట్లాడుతూ ప్రాణాల‌ను ప‌ణంగా పెట్టి రోగుల‌కు సేవ‌లందిస్తున్న త‌మ సిబ్బంది ఆరోగ్య భ‌ద్ర‌త‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని వారంద‌రికి వ్యాక్సినేష‌న్ ఇవ్వ‌డం జ‌రిగింద‌ని అన్నారు. ఇందుకు స‌హ‌క‌రించిన జిల్లా వైద్యాధికార బృందానికి వారు ప్ర‌త్యేకంగా కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

కోవిడ్ వ్యాక్సిన్ వేసుకున్న‌ట్టు వేలిపై గుర్తుల‌ను చూపిస్తన్న పీఆర్‌కే హాస్పిట‌ల్స్ చైర్మ‌న్ పుట్ట సుధాక‌ర్ యాద‌వ్‌, ఎండీ ర‌వికుమార్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here