నమస్తే శేరిలింగంపల్లి: హ‌్యూమన్ రైట్స్ ఆండ్ సోషల్ జస్టీస్ కమిషన్ తెలంగాణ రాష్ట్ర చైర్మన్‌గా శేరిలింగంపల్లికి చెందిన గున్నాల అనీల్ రెడ్డి నియమితులయ్యారు. కమిషన్ జాతీయ అధ్యక్షుడు నల్లా సంజీవరెడ్డి గురువారం అనీల్ రెడ్డికి నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా అనిల్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో మానవహక్కులకు విఘాతం కలుగకుండా, సామాన్యులకు న్యాయం జరిగేలా చూస్తానని అన్నారు. తనపై నమ్మకం ఉంచి భాద్యతలు అప్పగించిన కమిషన్ జాతీయ అధ్యక్షుడు నల్లా సంజీవరెడ్డి, చీఫ్ అడ్మినిస్ట్రేటీవ్, జాతీయ యువజన విభాగం అధ్యక్షులు అన్వర్ అలీలకు కృతజ్ఞతలు తెలిపారు.