నమస్తే శేరిలింగంపల్లి: మియాపూర్ డివిజన్ పరిధిలోని మయూరి నగర్ కాలనీ స్థానిక కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ పర్యటించారు. స్థానికంగా కొనసాగుతున్న వరదనీటి కాలువ పనులను పరిశీలించిన కార్పొరేటర్ నాణ్యతా ప్రమాణాల్లో రాజీ పడొద్దని కాంట్రాక్టర్‌కు సూచించారు. ఈ వరద కాలువ నిర్మాణంతో కాలనీ వాసులకు ఎంతో ఉపశమనం కలుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ డివిజన్ ప్రధాన కార్యదర్శి చంద్రిక ప్రసాద్ గౌడ్, కాలనీ వాసులు పాల్గొన్నారు.