నమస్తే శేరిలింగంపల్లి: గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని డైమండ్ హైల్స్‌లో కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి గురువారం పర్యటించారు. స్థానికంగా నెలకొన్న సమస్యలను కాలనీ వాసులు కార్పొరేటర్ దృష్టికి తీసుకువచ్చారు. ప్రధానంగా రోడ్లు, వీధి దీపాలు, సీసీ కెమెరాల ఏర్పాటు గురించి వివరించగా, ప్రధాన్యతా క్రమంలో సమస్యలన్ని పరిష్కారమయ్యేలా చూస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాలనీ ప్రముఖులు, డివిజన్ నాయకులు పాల్గొన్నారు.