నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆద్వర్యంలో ఏర్పడిన వేతన సవరణ కమిటీని పీఆర్‌టీయూ తెలంగాణ సంప్రదించింది. సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.చెన్నయ్య నేతృత్వంలో నేతలు కమిటీని కలసి పలు అంశాలపై చర్చించారు. ఉపాధ్యాయుల పరిస్థితులను పరిగణలోకి తీసుకుని వేతన సవరణలో తగిన అవకాశాలు కల్పించాలని కోరారు. తమ ప్రతిపాధనలను వేతన సవరణ కమిటి పరిగణలోకి తీసుకుంటుందని చెన్నయ్య ఆశాబావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పీఆర్‌టీయూ తెలంగాణ నాయకులు అంజిరెడ్డి, అనంతరెడ్డి గిరిధర్ రెడ్డి, హమీద్ తదితరులు పాల్గొన్నారు.