మియాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): మియపూర్ డివిజన్ పరిధిలోని ఆర్‌బీఆర్ అపార్ట్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన టెన్నిస్ కోర్ట్ ని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ, కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ లు ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఓంప్రకాష్ గౌడ్, నాగులు పటేల్, కృష్ణ పటేల్, భాస్కర్ గౌడ్, మురళి గౌడ్, సతీష్ గౌడ్, ప్రశాంత్ గౌడ్, ప్రవీణ్ గౌడ్, వాసు, సురేష్, ప్రతాప్, నాయక్, రామకృష్ణా రెడ్డి పాల్గొన్నారు.






