గచ్చిబౌలి (నమస్తే శేరిలింగంపల్లి): గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని బీజేపీ కార్యాలయంలో మంగళవారం స్వామి వివేకానందుని జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా వివేకానందుని చిత్రపటానికి కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వివేకానందుడు యువతకు స్ఫూర్తి అన్నారు. భారతదేశ ఖ్యాతిని నలుదిశలా వ్యాపింపజేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.






