శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): హాస్పిటల్ ఖర్చులను చెల్లించే స్థోమత లేని పలువురు బాధితులు సీఎం రిలీఫ్ ఫండ్‌కు దరఖాస్తు చేసుకోగా ఆ ఫండ్ నుంచి విడుదలైన సహాయాన్ని మంగళవారం ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ బాధితులకు అందజేశారు. చందానగర్ డివిజన్ భవానిపురంకు చెందిన సతీష్‌కు రూ.1.50 లక్షలు, కూకట్‌పల్లి డివిజన్ ఆస్బెస్టాస్ కాలనీకి చెందిన రఘురామ్‌కి రూ.1.50 లక్షల విలువైన ఎల్‌వోసీ పత్రాలను ఆయన అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం రిలీఫ్ ఫండ్ ఆపదలో ఉన్న పేదలకు అండగా నిలుస్తుందని తెలిపారు. ఎవరికి సహాయం అవసరం అయినా దరఖాస్తు చేసుకోవచ్చని, సహాయం అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివేకానంద నగర్ డివిజన్ కార్పొరేటర్ మాధవరం రోజాదేవి రంగారావు, కూకట్‌పల్లి డివిజన్ కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ, తెరాస నాయకులు గొట్టిముక్కల పెద్ద భాస్కర్ రావు, రాంచందర్ రావు పాల్గొన్నారు.






