మాదాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): మాదాపూర్ డివిజన్ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని కోరుతూ జోనల్ కమిషనర్ రవి కిరణ్ కు కార్పొరేటర్ వి.జగదీశ్వర్ గౌడ్ వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ డివిజన్ పరిధిలోని ఇజ్జత్‌నగర్ గ్రామం, ఖానామెట్, ఇజ్జత్ నగర్ వీకర్ సెక్షన్ బస్తీలలో శ్మశానవాటికలను అభివృద్ధి చేయాలని అన్నారు. అలాగే డివిజన్ పరిధిలో మంజూరైన అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేసేలా చూడాలని జోనల్ కమిషనర్‌ను ఆయన కోరారు. ఇందుకు జడ్‌సీ రవికిరణ్ సానుకూలంగా స్పందించారు. గంగల గణేష్ యాదవ్, బస్తీ తెరాస అధ్యక్షుడు బ్రహ్మయ్య యాదవ్, ఏరియా సభ్యులు శ్యామ్, కృష్ణ తైలి, కృష్ణ నాయక్, లోకేష్, షకీల్, అచ్యుత్, శ్రీనివాస్ పాల్గొన్నారు.






