సైబరాబాద్ (నమస్తే శేరిలింగంపల్లి): రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌కి సైబరాబాద్ సీపీ సజ్జనార్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు మంత్రిని ఆయన నివాసంలో కలిసిన సీపీ ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం సైబరాబాద్ పోలీస్, ఎస్‌సీఎస్సీల 2020 వార్షిక నివేదకను మంత్రికి సీపీ అందజేశారు. ఈ కార్యక్రమంలో శంషాబాద్ డీసీపీ ప్రకాష్ రెడ్డి, వుమెన్ అండ్ చిల్డ్రన్ సేఫ్టీ వింగ్ డీసీపీ అనసూయ, మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు, బాలానగర్ డీసీపీ పద్మజ, ఎస్సీఎస్సీ జనరల్ సెక్రెటరీ కృష్ణ ఏదుల పాల్గొన్నారు.







