నమస్తే శేరిలింగంపల్లి: నూతన సంవత్సర వేడుకలు ఓ ఇంట్లో తీవ్ర విషాదాన్ని నింపాయి. శేరిలింగంపల్లి గోపినగర్ బస్తీలో నివాసం ఉండే జాతోత్ పవన్ నాయక్ స్థానికంగా ఓ బిల్డర్ వద్ద సూపర్వైజర్గా విదులు నిర్వహిస్తున్నాడు. చిన్నతనంలోనే తండ్రి మృతిచెందడంతో తల్లితో పాట ఒక తమ్ముడు, ఒక చెల్లెలు భాద్యత పవన్‌పై పడింది. ఈ క్రమంలోనే ఉన్నంతంలో తన కుటుంబాన్ని పోషిస్తున్నాడు పవన్. కాగా ఇటీవల డిసెంబర్ 31వ తేది అర్ధరాత్రి మిత్రులతో కలసి నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొన్న పవన్ ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురైయ్యాడు. 11 కెవి విద్యుత్ తీగలు తగలడంతో శరీరం 30 శాతం వరకు కాలిపోయింది. దీంతో వెంటనే బస్తీవాసులు పవన్‌ని స్థానిక సిటిజెన్ హాస్పటల్‌కు తరలించారు.

పవన్ ముఖంతో పాటు శరీరంలోని వివిధ భాగాలు పెద్ద మొత్తంలో కాలిపోవడంతో ఐసీయూలో వైద్యులు చికిత్స జరుపుతున్నారు. ప్రస్థుతం పవన్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ఐతే పరిస్థితులకు అనుగుణంగా పలురకాల చికిత్సలు చేయాల్సి ఉంటుందని వైద్యులు తెలిపారు. ఇప్పటికే దాదాపు రూ.3 లక్షల వరకు ఖర్చు కాగా, మరో 3 సర్జరీలు చేయాల్సి ఉంటుందని వైద్యులు పేర్కొంటున్నారు. అదేవిధంగా పవన్ పూర్తిగా కోలుకునేంత వరకు ప్రతిరోజు గాయాలకు డ్రెస్సింగ్ చేయాల్సి ఉంటుందని తెలిపారు. ఈ క్రమంలో పెద్ద మొత్తంలో ఖర్చు చేయాల్సి ఉండగా కుటుంబానికి అధారమైన వ్యక్తే మంచం పట్టడంతో వారి కుటుంబం ఆందోళనలో పడింది. పవన్ చికిత్స కోసం సహకారం అందించాలని బంధువులు, స్నేహితులు, తెలిసిన వారిని ప్రాధేయ పడుతున్నారు. విశాలహౄదయం కలిగిన దాతలు గూగుల్ పే/ఫోన్ పె 9700676272, 7036109980 నెంబర్ల ద్వారా తమకు తోచిన సహకారాన్ని పవన్చికిత్స కోసం అందజేయవచ్చు. మీరు ఇచ్చే ఒక్క రూపాయి ఒక నిండు ప్రాణాన్ని, ఒక కుటుంబాన్ని నిలబెడుతుంది.






