శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): ఆంగ్ల నూతన సంవత్సరం సందర్బంగా ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీకి గచ్చిబౌలి డివిజన్ తెరాస నాయకుడు సత్యనారాయణ, తెరాస నాయకుడు సంగారెడ్డి, హఫీజ్‌పేట్ డివిజన్ మదీనాగూడ వాసులు, చందానగర్ డివిజన్ తెరాస నాయకుడు యాదగిరి గౌడ్ లు శుభాకాంక్షలు తెలిపారు.




పీఆర్‌టీయూఎస్ క్యాలెండర్ ఆవిష్కరణ…
హోప్ ఫౌండేషన్ ఛైర్మన్ కొండా విజయ్ కుమార్ సహకారంతో తెలంగాణ రాష్ట్ర పీఆర్‌టీయూ శేరిలింగంపల్లి శాఖ ఆధ్వర్యంలో మండల శాఖ నూతన సంవత్సరం టేబుల్ క్యాలెండర్ ను ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మండల పీఆర్‌టీయూఎస్ అధ్యక్షుడు మహేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి పి.ధన్ రాజ్, పీఆర్‌టీయూఎస్ జిల్లా బాధ్యుడు కృష్ణా రెడ్డి, శివకుమార్, ఆంజనేయులు, బలరాం, శ్రీనివాస్, దానయ్య, శ్రీనివాస్ రెడ్డి, మండల కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

శేరిలింగంపల్లి తెరాస నాయకులు జనార్దన్ రెడ్డి, లక్ష్మి నారాయణ గౌడ్, కరుణాకర్ గౌడ్ లు మంత్రి సబితా ఇంద్రా రెడ్డి, చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డిలకు కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డితో కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.


మియపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ కి బాలాజీ నగర్ కాలనీలోని బాలాజీ ఎన్‌క్లేవ్ అసోసియేషన్ సభ్యులు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.






