శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): రాష్ట్ర పశుసంవర్ధక శాఖ, సినీమాటోగ్రఫి శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ జన్మదినం సందర్భంగా అఖిల భారత యాదవ మహాసభ రంగారెడ్డి జిల్లా భేరీ రామచందర్ యాదవ్ మంగళవారం శుభాకాంక్షలు తెలియజేశారు. తలసాని యాదవ కులంలో పుట్టిన ఆణిముత్యం అని భెరి కొనియాడారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా యువజన విభాగం అధ్యక్షులు అందెల కుమార్ యాదవ్, డాక్టర్ కుమారస్వామి యాదవ్, నరేందర్ రెడ్డి, మిద్దె గూడెం శివ కుమార్, ప్రవీణ్ రాజేష్ యాదవ్, అశోక్, రాము, విజయ్ కృష్ణ యాదవ్, రంగారెడ్డి జిల్లా జిల్లా యాదవ సంఘం సభ్యులు పాల్గొన్నారు.