“వర్క్ ఫ్ర‌మ్‌ హోమ్ చెయ్యాలా వద్దా…? “

కరోనా అని ఇప్పుడు ఆఫీస్ లు మూసేసారు కానీ..ఆరోజుల్లో ఆఫీస్ కి వెళ్లాలంటే పొద్దున్నే లేచి చెక చెక రెడీ అయ్యి ట్రాఫిక్ పెరగక ముందే ఆఫీస్ కి రీచ్ అవ్వాలని తపించే వాళ్ళం. అటు ఇటు అయ్యి లేట్ అయిందా అంతే సంగతి ట్రాఫిక్ కొరల్లో చిక్కుకోవడమే.. తద్వారా ఆ చీకాకు, ఫ్రస్ట్రేషన్ పని మీద పడుతుందా అన్న కంగారు. ఆఫీస్ కి వెళ్ళి పని చేసే రోజుల్లో ఎంత పని ఉన్నప్పటికి కొలిగ్స్ తో ముచ్చట్లు చెప్పుకుంటూ, మధ్యలో ఛాయిలు అంటూ తిరుగుతూ, క్యాంపస్ లో ఎదురు వచ్చిన వారిని పలకరిస్తూ మనకి తెలిసిన వాళ్లతో పీచా పాటి మాట్లాడ్తు ఉంటె ఎంత పని చేసినప్పటికి ఇలాంటి వాతావరణం లో ఉండేసరికి ఆ పని వత్తిడి ని కూడా ఆదిగమించే వాళ్లము. వీకెండ్ ఎప్పుడు వస్తుందా అని వారం లో మొదటి రోజు అయిన సోమవారం నుంచే లెక్కలు వేసుకునే వాళ్లు కూడా లేకపోలేదు అనుకోండి. ప్రస్తుత పరిస్థుతుల్లో ఇవ్వన్నీ తలచుకుంటే మధురానుబూతులు.

కరోనా వచ్చి దాదాపు గ ఏడాదిన్నరా దాటినా, అది మనల్ని ఇంకా పూర్తిగా వదలకపోవడం. వాణిజ్య కార్యక్రమాలు దెగ్గర నుంచి గుడులు, బడులు ఆల్మోస్ట్ అన్ని రంగాలు అంతంత మాత్రంగానే కార్యకలాపాలు సాగించటం మనం చూస్తున్నాం.. అయితే చాలా మంది సాఫ్ట్వేర్ రా అనగానే అబ్బా ఈ కరోనా కాలం లో వీరే కంఫరటబుల్ గ ఇంట్లో కూర్చొని పని చేసుకుంటున్నారు..ఇంట్లో కావాలంటే పడుకొని కూడా పని చెయ్యొచ్చు, ఏమి లైఫ్ రా వీళ్ళది అని అనుకునే వారే ఎక్కువ.. కానీ వాస్తవానికి వర్క్ ఫ్రొం హోం మొదలైన కొత్తలో బాగానే ఉన్నప్పటికి క్రెమేపి వర్క్ లోడ్ పెరగటం, ఆఫీస్ లో అయితే 9 గంటలు అవ్వగానే లాగ్ అవుట్ చేసే వెసులుబాటు ఉంటె ఇంట్లో నుంచి పని చేసేటప్పుడు ఎలాగో ట్రావెలింగ్ లేదు కదా ఆ టైం కూడా వర్క్ కోసమే వినియోగగించమని కొన్ని కంపెనీలు సూచించటం తో అనేకమంది పని వత్తిడి కి గురి అవుతున్నారాట. ఇవి కాకుండా కరెంట్ కోతలు, ఇంటర్నెట్ సర్రిగా సహకరించక పోవటం, ఇంట్లో చిన్న పిల్లలు మాటి మాటికీ వచ్చి డిస్టర్బ్ చెయ్యటం వంటి అంశాలు కొంత మందిని ఇబ్బంది పెడుతున్నాయట. ఇవ్వని గత ఏడాదిన్నరా గ నడుస్తున్న పరిణామాలు అయితే తాజా గ దేశం లో ఇప్పటికే వాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా జరగటం. సాఫ్ట్వేర్ కంపెనీలు సైతం వారి ఉద్యోగస్థులకి మరియు వారి కుటుంబ సభ్యులకి స్పెషల్ గ వాక్సినేషన్ డ్రైవ్ లు పెట్టి వాక్సిన్ ని అందిస్తున్న క్రమంలో, కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, IT ఆఫీస్ లని తెరిస్తే బావుంటుందని సూచించటం తో దీని మీద ఉద్యోగస్థులు విభిన్న స్వరాలు వినిపిస్తున్నారు.

చాలా మటుకు ఎంప్లాయిస్ లాక్డౌన్ ప్రకటించాగానే సిటీ లో ఉంటున్న తమ ఇళ్లను కాలి చేసి వాళ్ళ సొంత ఊర్లకి వెళ్లిపోయారు. కరోనా పుణ్యమా అని ఇంటి దెగ్గర ఉంటూ పని చేసుకోవటం మంచి అవకాశం అని కొంతమంది భావిస్తుంటే కొంతమంది మటుకు ఎన్ని రోజులని ఇంట్లో కూర్చుంటాం వీకెండ్ వచ్చింది పోయింది అని కూడా తెలియట్లేదు. కనెక్టివిటీ కష్టాలు, కరెంటు కోతలు, వర్క్ ప్రెజర్ కూడా ఎక్కువ అయిపోయాయి. కొంత వరకు బానే ఉంటుంది ఇలా ఎలా ఎన్ని రోజులు భరించగలం అని అభిప్రాయ పడుతున్నారు. మరి కొంతమంది అయితే వచ్చిన అవకాశాన్ని సద్వినియోగ పరుచుకోవాలని, ఇలా చెయ్యటం వళ్ళ చాలా డబ్బులు మిగులుతున్నాయి అని ఇంట్లో వాళ్ళ మధ్యలో కూర్చుని పని చేసుకోవటం బావుందని అని అంటున్నారు,ఇలా ఇంట్లో కూర్చొని పని చేసే అవకాశం ఎంత మందికి వస్తుందని అని కూడా ప్రశ్నిస్తున్నారు. కొన్ని సందర్భాలల్లో రెండు డోసులు వాక్సిన్ తీసుకున్నప్పటికీ కరోనా వస్తుందని, ఇవి కాకా కొత్త వేరియంట్స్ కూడా పుట్టుకు వచ్చె అవకాశం ఉందని అని ప్రచారం జరుగుతున్న తరుణం లో ఇప్పుడు ఆఫీస్ లు తెరిస్తే మళ్ళీ అది ప్రమాదాకారి గ అయ్యే అవకాశం ఉంటుందని, ఆఫీస్ లో ఎలేవేటర్స్ దెగ్గర కానీ, lobbies దెగ్గర కానీ washrooms దెగ్గర డిస్టెన్స్ పాటించటం కష్టం అని, మరి కొన్ని రోజులు వేచి చూడటమే ఉత్తమమని అభిప్రాయ పడుతున్నారు.

ఏది ఏమి అయినప్పటికి కరోనా మాత్రం తొందరగా కను మరుగు అయ్యి మళ్ళా పాత రీతిలో ప్రపంచం పరుగులు పెట్టాలని ఆశిద్దాం.

వఝా పవన్.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here