నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని ఆల్విన్ ఎక్స్ రోడ్ బిజెపి కార్యాలయం వద్ద రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జ్ఞానేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ఎంతో మంది బలిదానం, ఎన్నో ఉద్యమాలు, మరెన్నో పోరాటాలు వెరసి ఏర్పడిందే తెలంగాణ రాష్ట్రమని, 29వ రాష్ట్రంగా ఏర్పడడానికి వెనుక ఎంతో మంది ప్రాణత్యాగం ఉందని అన్నారు. ప్రజల వీరోచిత పోరాటానికి గుర్తుగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. రాష్ట్రంలో నిరంకుశ పాలన సాగుతుందన్నారు. రజాకారుల నుంచి స్వేచ్ఛ, స్వాతంత్య్రం సాధించిన రోజును అధికారికంగా జరుపుకోలేకపోవడం సిగ్గుచేటన్నారు. కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు నాగుల్ గౌడ్, మనోహర్, శ్రీధర్ రావు, మాణిక్ రావు, శ్రీశైలం కురుమ, రవి గౌడ్, వర ప్రసాద్, కోటేశ్వరరావు, జితేందర్, పృథ్వి కాంత్, రామయ్య, బాబు రెడ్డి, ఆకుల లక్ష్మణ్, రామకృష్ణ, సిద్దు, విజేందర్, ఆంజనేయులు, అనిల్, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.