నమస్తే శేరిలింగంపల్లి: రాష్ట్రంలోని మద్యం దుకాణాల్లో గౌడలకు 15 శాతం రిజర్వేషన్ అమలుకు రాష్ట్ర క్యాబినెట్ తీసుకున్న నిర్ణయం పట్ల తెలంగాణ గౌడ కల్లుగీత సంఘాల సమన్వయ కమిటీ హర్షం వ్యక్తం చేసింది. రాష్ట్ర ఆబ్కారి శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ ను మినిస్టర్ క్వార్టర్స్ లోని తన నివాసంలో గౌడ కల్లు గీత సంఘాల సమన్వయ కమిటీ సభ్యులు కలిశారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు పుష్పగుచ్చం అందజేసి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ మద్యం దుకాణాల్లో గౌడల కు 15 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 5 శాతం రిజర్వేషన్లు కేటాయిస్తూ రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించడం సంతోషకరమని అన్నారు. ఆయా కులాల్లో ఆర్థిక పరిపుష్టి చేకూతుందని, యువతకు ఉపాధి దొరుకుతుందని అభిప్రాయం పడ్డారు. మంత్రిని కలిసిన వారిలో చైర్మన్ బాలగౌని బాల్ రాజ్ గౌడ్, రాష్ట్ర కన్వీనర్ అయిలి వెంకన్న గౌడ్, వర్కింగ్ చైర్మన్ యెలికట్టె విజయ్ కుమార్ గౌడ్, వైస్ చైర్మన్ గడ్డమీది విజయ్ కుమార్ గౌడ్, టిజిఓ రాష్ట్ర నాయకులు పుల్లెంల రవీందర్ గౌడ్, కృష్ణమూర్తి గౌడ్, బాలగౌని వెంకటేష్ గౌడ్ తదితరులున్నారు.