నమస్తే శేరిలింగంపల్లి : ఓ వివాహిత ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. దొండపాటి దేవరాజు(33) అతని సోదరి కె. రాణి (36) కుటుంబంతో సహా జీవనోపాధి కోసం పదేళ్ల క్రితం హైదరాబాద్‌కు వలస వచ్చి చందానగర్‌లోని ప్రభుత్వ పాఠశాల సమీపంలోని పాపిరెడ్డి కాలనీలో నివాసం ఉంటున్నారు. 2008లో కె. దినేష్ తో తన సోదరికి వివాహం జరిపించాడు. వారికి ముగ్గురు పిల్లలు. గత మూడు సంవత్సరాల నుండి కె. రాణిని తన అత్త వాళ్లు ఇంటికి రానివ్వటం లేదు. 03న సుమారు ఉదయం 6 గంటల సమయంలో తీవ్ర మనస్తాపం చెంది కె రాణి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తన బావమరిది అక్రమ సంబంధం వల్లే తన సోదరి మృతి చెంది ఉంటుందని రాణి సోదరుడు దేవరాజు చందానగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.