కేటీఆర్ కి చిర్రా రవీందర్ యాదవ్ ఉగాది శుభాకాంక్షలు

శేరిలింగంపల్లి, మార్చి 19 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కి శేరిలింగంపల్లి ఉద్యమ నాయకుడు చిర్రా రవీందర్ యాదవ్ శ్రీ పరాభవ నామ సంవత్సరాది ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఉగాది సందర్బంగా కేటీఆర్ ను ప్రత్యేకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపిన చిర్రా రవీందర్ యాదవ్ కు కేటీఆర్ సైతం విష్ చేశారు. అలాగే కండువాను కప్పి తన అభిమానాన్ని చాటారు. అనంతరం చిర్రా రవీందర్ యాదవ్ యోగ క్షేమాలను కేటీఆర్ అడిగి తెలుసుకున్నారు. శేరిలింగంపల్లిలోని తాజా రాజకీయాలు సైతం కొద్ది సేపు చర్చకు వచ్చినట్లుగా చిర్రా రవీందర్ యాదవ్ వెల్లడించారు. అనంతరం ఉద్యమ నాయకుడు చిర్రా రవీందర్ యాదవ్ మాట్లాడుతూ.. శేరిలింగంపల్లి ప్రజానీకానికి ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. శేరిలింగంపల్లి ప్రజానీకానికి శ్రీ పరాభవ నామ సంవత్సరాది ఉగాది శుభాకాంక్షలు తెలపడంతో పాటు ప్రతి కుటుంబం సుఖశాంతులతో, అభివృద్ధి మార్గంలో ముందుకు సాగాలని, ప్రతి ఇంటా ఆనందం, ఆయురారోగ్యం, ఐశ్వర్యాలు నింపాలని ఆకాంక్షిస్తున్నట్లు వెల్లడించారు. ఉగాది కొత్త ఆరంభాలకు ప్రతీక అని పేర్కొన్నారు. ప్రతి కుటుంబం సుఖశాంతులతో, అభివృద్ధి మార్గంలో ముందుకు సాగాలని కోరుకున్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here