సీఎంఆర్ఎప్ ఎల్వోసీ అందజేత

నమస్తే శేరిలింగంపల్లి: హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని అడ్డగుట్ట కి చెందిన వీరవెంకట అర్జున షణ్ము అత్యవసర వైద్య చికిత్స నిమిత్తం ముఖ్య మంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకోగా.. సీఎంఆర్ఎప్ ఎల్వోసీ నుంచి రూ. 60 వేలు మంజూరయ్యాయి. ఈ ఆర్థిక సహాయానికి సంబంధించిన సీఎంఆర్ఎప్ ఎల్వోసీ మంజూరి పత్రాలను బాధిత కుటుంబానికి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ అనారోగ్యంకు గురై ఆర్థిక స్థోమత లేక ఆసుపత్రిలో చికిత్స పొందిన నిరుపేదలకు , అభాగ్యులకు అండగా..సీఎం సహాయ నిధి ఆర్థిక భరోసా నిస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా వైద్య చికిత్స కి సహకారం అందించిన ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీకి బాధితుల కుటుంబ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here