శేరిలింగంపల్లి, మార్చి 19 (నమస్తే శేరిలింగంపల్లి): తెలుగు నూతన సంవత్సరం, ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని సీనియర్ నాయకుడు గణేష్ ముదిరాజ్ జన్మదినోత్సవం సందర్భంగా మక్తా మహబూబ్ పేట్ డివిజన్, బీకే ఎన్‌క్లేవ్ వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్రాల ప్రారంభోత్సవ కార్యక్రమాలలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, శేరిలింగంపల్లి అసెంబ్లీ ఇంఛార్జి రవికుమార్ యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొని చలివేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజలకు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలుగు నూతన సంవత్సరం ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. చలివేంద్రం ఏర్పాటు చేయడం గొప్ప విషయమని, ఈ వేసవి కాలంలో ఎండ తీవ్రత వల్ల రోడ్లపై నడిచి తిరిగే పాదచారులు, ట్రాఫిక్ జామ్ లలో వాహన దారులు తాగడానికి సరైన మంచినీరు అందుబాటులో లేకపోవడం వలన చాలా మంది అనేక ఇబ్బందులు పడుతుంటారని అన్నారు. చలివేంద్రం ఏర్పాటు చిన్న సేవా కార్యక్రమమే కావచ్చు, మనల్ని చూసి ఇంకా కొంత మంది వారి వారి కాలనీలలో, బస్తీలలో ఏర్పాటు చేస్తే మన వల్ల ఇంకొంత మంది పాదచారులకు మంచినీరు దొరుకుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆకుల లక్ష్మణ్, శివారెడ్డి, శ్రీనివాస్, రాజేష్ గౌడ్, మాణిక్ రావు, బాబు, రాము, శ్రీధర్, మల్లేష్, మన్యం, గణేష్ చారి, సీతారామరాజు, వీరు యాదవ్, కృష్ణ, పద్మ, రెడ్డమ్మ, విజయేందర్, నవీన్ యాదవ్ పాల్గొన్నారు.






