శేరిలింగంపల్లి, మార్చి 19 (నమస్తే శేరిలింగంపల్లి): హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని ఉషా ముళ్ళపూడి కమాన్ వద్ద క్షత్రియ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రంను మియాపూర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి మాజీ కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు. అనంతరం చల్లని మజ్జిగను కాలనీ వాసులకు, బాటసారులకు అందజేశారు. ఈ సందర్బంగా నార్నె శ్రీనివాసరావు మాట్లాడుతూ ఉగాది పర్వదినం రోజున చలివేంద్రం ఏర్పాటు చేసుకోవడం చాలా అభినదించ దగ్గ విషయం అని అన్నారు. నగరంలో రోజు రోజుకూ ఎండలు విపరీతంగా పెరిగిపోతున్నాయని, ప్రజలు ఎండలకు నీళ్లకు ఇబ్బంది పడకుండా ఉండటానికి ఈ చలివేంద్రం దాహార్తిని తీర్చడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకుడు దేశాల్, క్షత్రియ యూత్ అసోసియేషన్ సభ్యులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.






