నమస్తే శేరిలింగంపల్లి: మాదాపూర్ శిల్పారామంలో జరిగే వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా నిర్వహించిన కూచిపూడి నృత్య ప్రదర్శన సందర్శకులను అలరించింది. వేదం ఆర్ట్స్ అకాడమీ నృత్య గురువు వసుమతి వర్కల శిష్య బృందం తమ అభినయంతో ఆకట్టుకున్నారు. వినాయక కౌతం, దశావతార శబ్దం, ముందుక శబ్దం, జనుత శబ్దం, తరంగం , అన్నమాచార్య కీర్తన, భామాకలాపం, రామాయణ శబ్దం, మహాగణపతిమ్, పుష్పాంజలి, రామదాసు కీర్తన, రామనామో కీర్తన , సహచరోతమా ప్రణామం కోవిడ్ అవగాహన గీతని ప్రదర్శించి మెప్పించారు. నర్తకీమణులు వసుమతి, సుప్రజ, శ్రీనిధి, వైష్ణవి, ప్రత్యుష, శ్రేయ, శర గుప్తా, అక్షయని తదితరులు నృత్య ప్రదర్శనలో పాల్గొన్నారు.