మియాపూర్ పోలీస్‌స్టేష‌న్‌లో హ‌రిత హారం… మొక్క‌లు నాటిన డీసీపీ వెంక‌టేశ్వ‌ర్లు…

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: మియాపూర్ పోలీస్‌స్టేష‌న్‌లో శుక్ర‌వారం సాయంత్రం హ‌రిత‌హారం కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న మాదాపూర్ డీసీపీ వెంక‌టేశ్వ‌ర్లు, మియాపూర్ ఏసీపీ కృష్ణ ప్ర‌సాద్‌లు పోలీస్‌స్టేష‌న్ ప్రాంగ‌ణంలో మొక్క‌లు నాటారు. ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ ప్ర‌తి ఒక్క‌రి భాద్య‌త అని అన్నారు. మొక్క‌లు నాట‌డంతో పాటు వాటిని పెంచి పోషించాల‌ని సూచించారు. మియాపూర్ ఠాణ ప‌చ్చ‌ద‌నంతో క‌ళ‌క‌ళ‌లాడుతుంద‌ని, అందుకు కృషి చేసిన ఇన్‌స్పెక్ట‌ర్ వెంక‌టేశ్ సామ‌ల‌, స్టేష‌న్‌ సిబ్బందిని వారు అభినందించారు. ఈ కార్య‌క్ర‌మంలో ఎస్ఐలు ర‌వికిర‌ణ్‌, బ్ర‌హ్మం, మౌనిక‌, సిబ్బంది పాల్గొన్నారు.

మొక్క‌లు నాటుతున్న డీసీపీ వెంక‌టేశ్వ‌ర్లు, ఏసీపీ కృష్ణ ప్ర‌సాద్‌, ఇన్‌స్పెక్ట‌ర్ వెంక‌టేశ్ సామ‌ల, సిబ్బంది
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here