నమస్తే శేరిలింగంపల్లి: మొక్కలు నాటడంతో మన బాధ్యత తీరిపోదని, అవి ఎదిగే వరకూ వాటిని సంరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరూ తీసుకోవాలని గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి అన్నారు. శనివారం పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని ఎన్టీఆర్ నగర్ లో పట్టణ ప్రగతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన స్థానిక నాయకులు తో కలిసి మొక్కలు నాటారు. అనంతరం గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ పర్యావరణాన్ని రక్షించాలి బాధ్యత మనందరిపై ఉందని, ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేయాలన్నారు. మొక్కలు నాటడమే కాకుండా వాటి సంరక్షణ బాధ్యత కూడా తీసుకోవాలన్నారు. పారిశుధ్య నిర్వహణలో భాగంగా పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని తొలగించి బస్తీలను పరిశుభ్రంగా మార్చాలన్నారు. కరోనా వైరస్ పట్ల ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తాగునీరు, పారిశుద్ధ్య నిర్వహణ, పచ్చదనం పెంపు తదితర మౌలిక సదుపాయాలు కల్పించే ఉద్దేశంతో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎంఒహెచ్ డాక్టర్ రవి కుమార్, శానిటరీ ఇనస్పెక్టర్ జలెందర్ రెడ్డి, డిఈ శ్రీనివాస్, ఎంటమాలజీ ఏఈ కిరణ్ కుమార్, రంగారెడ్డి జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షుడు హనుమంతు నాయక్, సీనియర్ నాయకులు విఠల్, సుబ్రహ్మణ్యం, శ్రీరాములు, రమేష్, రంగస్వామి, కృష్ణ, నర్సింగ్, ప్రసాద్, జీహెచ్ఎంసీ అధికారులు, ఎస్ ఆర్ పీ కృష్ణ గారు, జి.హెచ్.ఎం.సి శానిటేషన్ సూపర్వైజర్ రాందాస్ తదితరులు పాల్గొన్నారు