నమస్తే శేరిలింగంపల్లి: కర్మచారి వృత్తులకు ఆద్యుడైన విశ్వకర్మ ప్రపంచానికే వెలుగు చూపిన సృష్టికర్త అని మాజీ హై కోర్టు న్యాయమూర్తి చంద్రమూర్తి అన్నారు. ఆదివారం విశ్వకర్మ ఫౌండేషన్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆద్వర్యంలో జరిగిన ఆత్మీయ సమావేశం , వివాహ పరిచయ వేదిక కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక లక్ష్యం కోసం సమాజంలో ప్రేమతత్వం తో మెలిగి వారికి భగవంతుని ఆశీస్సులు ఉంటాయన్నారు.

అనంతరం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగల సంఘాల అధ్యక్షులు పద్మా చారి మాట్లాడుతూ వ్యవసాయరంగం తో పాటు ఇతర చేతి వృత్తుల ఉనికికి మూల కారకుడు విశ్వకర్మ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి , ఇంటలిజెన్స్ సిఐ మనోహర్ రావు, బిహెచ్ఈఎల్ గుల్మమోహర్ పార్క్ విశ్వకర్మ ఫౌండేషన్ అధ్యక్షులు శ్అట్లూరి రవీంద్రచారి, నాయకులు రాములు, దేవేంద్ర చారి, శ్రీపాద రాము, సత్యం చారి, శేరిలింగంపల్లి నియోజక వర్గ విశ్వకర్మ ఫౌండేషన్ కమిటీ సభ్యులు శంకర చారి, రామ చారి, వెంకట చారి, శ్రీధర్ చారి, శ్రీనివాస్ చారి, మల్లేష్ చారి, మాధవ్ చారి తదితరులు పాల్గొన్నారు.
