చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): పుల్వామా దాడిలో మృతి చెందిన అమరీ వీర జవానులకు ఆయువ్ స్టూడెంట్ యూత్ ఫౌండేషన్ ఘన నివాళులర్పించింది. హుడా కాలనీ కమ్యూనిటీ హాల్‌లో అమర వీర జవానుల చిత్రపటానికి నివాళులర్పించిన ఫౌండేషన్ సభ్యులు కొవ్వత్తులు వెలిగించి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ వ్యవస్థాపకులు రోషిత్ ముదిరాజ్ మాట్లాడుతూ శతృవుల దొంగ దెబ్బలో అమరులైన జవానుల ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్ధించారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ఉపాధ్యక్షులు చరణ్, ప్రధాన కార్యదర్శి రాజేష్, కోశాధికారి భాను ముదిరాజ్, సభ్యులు చందు, సంతు, అఖిల్, బాలకృష్ణ, గౌరి, వసంత్, మురళీ, లక్ష్మన్, వినయ్, కలీమ్, చందు, చరణ్ గౌడ్, కిరణ్ గౌడ్, శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు.
