- ఒకేరోజు రూ.32 లక్షలు నిధి సమర్పణ…

నమస్తే శేరిలింగంపల్లి: బిజెపి రాష్ట్ర నాయకులు మొవ్వా సత్యనారాయణ నేతృత్వంలో రామ జన్మభూమి నిధి సమర్పణ అభియాన్ కార్యక్రమం శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ఉత్సాహంగా సాగింది. దాదాపు 29 మంది రామ భక్తులు రూ.32 లక్షల రూపాయల నిధిని సమకూర్చారు. ఆర్ఎస్ఎస్ సికింద్రాబాద్ విభాగ్ ప్రచారక్ యాదిరెడ్డి, శారీరక్ ప్రముఖ్ నారాయణ మూర్తి, మాదాపూర్ నగర సంఘచాలక్ బోస్ ల ఆద్వర్యంలో నిర్వహించిన జన జాగరణ్ కార్యక్రమంలో మాజీ రాజ్యసభ సభ్యులు గరికపాటి మోహన్ రావుతో పాటుమొవ్వా సత్యనారాయణ కలిసి పాల్గొన్నారు.

అయోధ్య రామ మందిరానికి మొవ్వ సత్యనారాయణ రూ.5 లక్షల నిధి సమర్పణ చేయగా, జె.శారద జైపాల్ దంపతులు 2,51,000, ఉదయ హైట్స్ రాజశేఖర్ రూ.2,16,000, ఎస్.ఆర్ ఇన్ఫ్రా అధినేత మచ్చ రాజేష్ రూ. 1,11,111, కార్తిక్ లు రూ.1,01,116, శ్రీ వేంకటేశ్వర కన్‌స్ట్రక్షన్స్ సంస్థ రూ. 1,00,016, చెస్ క్రీడాకారిణి ద్రోణవల్లి హారిక దంపతులు, డీఎస్ఆర్కే ప్రసాద్, రమాదేవి దంపతులు, కె.వి.బి.సుబ్బారావు, బాబురావు, ఎం.జగదీశ్వర్‌రావు, శ్రీ చక్ర మిల్క్, శ్రీ చందన మిల్క్ సంస్థల అధినేతలు రూ.1 లక్ష చొప్పున నిధి సమర్పణ చేశారు. వీరితో పాటు మరో 17 మంది రామసేవకులు కలిసి దాదాపు రూ.32 లక్షల రూపాయల నిధిని రామ మందిరానికి సమర్పించారు.

ఈ సందర్భంగా గరికపాటి మోహన్ రావు మాట్లాడుతూ రామకార్యంలో భాగస్వామ్యమైనందుకు ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. రామ భక్తుల శతాబ్దాల కల అయిన అయోధ్య రామ మందిర నిధి సమర్పణలో పాలు పంచుకోవడం తనకు లభించిన అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. మొవ్వా సత్యనారాయణ పెద్ద మొత్తంలో నిధిని సమకూర్చడం అభినందనీయమని అన్నారు. అనంతరం ఆర్ఎస్ఎస్ సికింద్రాబాద్ విభాగ్ ప్రచారక్ యాదిరెడ్డి మాట్లాడుతూ అయోధ్య రామ జన్మభూమిలో మందిర నిర్మాణం కోసం గత కొన్ని రోజులుగా నిర్వహిస్తున్న నిధి సేకరణ అభియాన్ కార్యక్రమానికి అద్భుతమైన స్పందన వస్తుందన్నారు. దేశ ప్రజలంతా కలిసి హిందువుల ఆత్మగౌరవ ప్రతీక అయిన రామ మందిర నిర్మాణంలో భాగస్వామ్యం కావడం ఐక్యతకు నిదర్శనమన్నారు.

ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు నందకుమార్ యాదవ్, నరేష్, చింతకింది గోవర్ధన్ గౌడ్, డీఎస్ఆర్కే ప్రసాద్, హరి, మణిభూషన్, రామసేవకులు విజయభాస్కర్ రెడ్డి, పుట్ట వినయకుమార్ గౌడ్ లు పాల్గొన్నారు.
