ప్రజాపాలన ప్రభుత్వంలోనే తెలంగాణ ఉద్యమకారులకు సముచిత స్థానం : కాంగ్రెస్ నాయకులు ఏకాంత్ గౌడ్

నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణ ఇచ్చింది, తెలంగాణ ఉద్యమకారులను గౌరవించేది కాంగ్రెస్ పార్టీ అని  ఆ పార్టీ నియోజకవర్గ నాయకుడు ఏకాంత్ గౌడ్  తెలిపారు. తెలంగాణ ఉద్యమ సమయంలో పాల్గొన్న తెలంగాణ ఉద్యమకారుడు నర్సింహకు తగిన గుర్తింపు లభించింది.  తెలంగాణ లోగోను ప్రతి ఆర్టీసి బస్ కు, కనిపించిన గోడకు వేస్తూ.. ఎక్కడ ఉద్యమం చేసిన అక్కడికి వెళ్లి సంఘీభావం తెలుపుతూ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న నర్సింహను  ఏకాంత్ గౌడ్ శాలువాతో సత్కరించారు. ఈ సందర్బంగా తెలంగాణ ఉద్యమకారుడు నర్శిమ్మ మాట్లాడుతూ.. 10 సంవత్సరాల బిఆర్ ఎస్ ప్రభుత్వ పాలనలో తెలంగాణ ఉద్యమ కారులను ఏనాడూ గౌరవించలేదని, ఏనాడూ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

తెలంగాణ ఉద్యమకారుడు నర్సింహను శాలువాతో సత్కరించిన దృశ్యం

ఈ సందర్బంగా ఏకాంత్ గౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమ పార్టీ అని చెప్పుకొనే బి ఆర్ ఎస్ గడిచిన 10 సంవత్సరాలలో ఏనాడూ తెలంగాణ ఉద్యమకారులను పట్టించుకోలేదని చెప్పారు. కాని కాంగ్రెస్ ప్రజా పాలన ఏర్పడిన 50 రోజుల్లోనే తెలంగాణ జేఏసీ చైర్మన్, తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపిన ప్రొఫెసర్ కోదండరాంకి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి గౌరవించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని తెలిపారు.  ఈ కార్యక్రమంలో అల్వాల్ భాస్కర్, దుర్గ స్వామి, పల్నాటి అశోక్, అశోక్, నాగరాజు, నవీన్, అల్వాల్ రమేష్, హనుమంతు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here