నమస్తే శేరిలింగంపల్లి: గ్రేటర్ పరిధిలోని అపార్ట్‌మెంట్ వాసులకు ప్రభుత్వం ప్రకటించిన ఉచిత త్రాగునీటి పథకాన్ని మియాపూర్ డివిజన్‌లో వెంటనే అమలు చేయాలని బి.జె.పి జిల్లా ఉపాధ్యక్షులు డి.ఎస్.అర్. కె.ప్రసాద్ అన్నారు. మియాపూర్ డివిజన్ పరిధిలో అపార్ట్‌మెంట్‌లలో పథకం అమలు నేటికీ ప్రారంభించలేదని, అపార్ట్‌మెంట్ వాసులు ఎలా నమోదు చేసుకోవాలనే విషయంపై అవగాహన కల్పించలేదన్నారు. కేన్ నెంబర్ కి ఒక మొబైల్ నెంబర్, ఆధార్ నంబర్ కి మరో మొబైల్ నంబర్ లింక్ చేయబడిన కారణంగా అపార్ట్మెంట్స్ వాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. జలమండలి సిబ్బంది అపార్ట్మెంట్స్ లోని ప్రతి ఫ్లాట్ ని కేన్ నెంబర్‌ను అనుసంధానం చెయ్యాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ పథకాన్ని ప్రజలకు అందేలా అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు.






