నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగ్గంపల్లి నియోజకవర్గం పరిధిలోని 10 డివిజన్ల అభ్యర్థులకు పార్టీ నాయకులు బి ఫారం లు అందజేశారు. శనివారం మియాపూర్ క్యాంపు కార్యాలయంలో పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరావు, ప్రభుత్వ విప్ అరికెపూడి గాంధీ చేతుల మీదుగా ఆయా డివిజన్ల అభ్యర్థులు బి ఫార్మ్స్ అందుకున్నారు. ఈ సందర్భంగా నామ నాగేశ్వర రావు, అరెకపూడి గాంధీ లు మాట్లాడుతూ పార్టీ అభ్యర్థులంతా ఎన్నికల్లో విజయం సాధించేలా ప్రణాళికాబద్ధంగా నడుచుకోవాలని సూచించారు. టిఆర్ఎస్ ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలను, చేపట్టినా అభివృద్ధి కార్యక్రమాలను ఎన్నికల ప్రచార అస్త్రాలుగా ఉపయోగించుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా బి ఫార్మ్స్ అందుకున్న అభ్యర్థులు ముఖ్య మంత్రి కేసీఆర్ , మంత్రి కేటీఆర్, ప్రభుత్వ విప్ గాంధీ, ఎంపీ రంజిత్ రెడ్డిలకు కృతఙ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు వి.జగదీశ్వర్ గౌడ్, పూజిత జగదీశ్వర్ గౌడ్, మంజుల రఘునాథ్ రెడ్డి, కొమిరిశెట్టి సాయిబాబా, రాగం నాగేందర్ యాదవ్, హమీద్ పటేల్, ఉప్పలపాటి శ్రీకాంత్, దొడ్ల వెంకటేష్ గౌడ్, నార్నె శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.









